మహేష్ కోసం షారుఖ్.. నా ఫ్రెండ్ మహేష్ ‘గుంటూరు కారం’ అంటూ ట్వీట్..

-

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం .ఈ చిత్రం నిన్న జనవరి 12న థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక గుంటూరు కారం సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గుంటూరు కారం సినిమా గురించి ట్వీట్ వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారుఖ్ ఈ ట్వీట్ లో.. నా ఫ్రెండ్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ చూడటానికి ఎదురు చూస్తున్నాను. ఒక మంచి ఎమోషన్,యాక్షన్, మాస్ సినిమా అని రాసి షారుఖ్ ఖాన్ ట్రైలర్ కూడా షేర్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ షారుఖ్ తమ హీరో సినిమా గురించి పోస్ట్ చేసారంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ మరింత వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version