మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి : ఏపీ సీఎం

-

కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి లేదా బయటనుంచి నిపుణుల్ని కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నవాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైమ్ లో వినియోగించుకోవాలి. పోలీసింగ్ అనేది ప్రభావవంతంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను కూడా పెట్టుకుని నేరస్థుల్ని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. డ్రోన్ల ద్వారానూ ర్యాండమ్ గా తనిఖీలు నిర్వహించాలి. రహదారులపై కొన్ని హాట్ స్పాట్ లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరక్కుండానూ చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలి. కొన్ని కేసుల దర్యాప్తు విషయాలను బయటకు వెల్లడించటం ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెంచాలి. సైబర్ క్రిమినల్స్ కు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులూ కొత్త పరిజ్ఞానం ఉపయోగించాలి. సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ నేరాలు, ప్రమాదాల నియంత్రణ జరుగుతోంది. దాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నా. నేరస్తులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version