మూడో రోజూ కొన‌సాగుతున్న ఐటీ దాడులు..

-



టీడీపీనేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంపెనీల్లో ఐటీ దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. బాలాజీ గ్రూఫ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఆదివారం సైతం సంస్థ ఆఫీసులు, ఫ్యాక్టరీలతో పాటూ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కంపెనీలకు సంబంధించిన లావాదేవీలతో పాటు కీలకమైన ఫైళ్లు, డాక్యుమెంట్లను ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో ఇప్పటివరకు రూ.55 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు స‌మాచారం. మూడు రోజుల నుంచి సోదాలు జరుగుతుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్‌ నేతగా ఉన్నారు.. విభజన తర్వాత 2104 ఎన్నికలకు ముందు తెదేపా చేరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తెదేపా నేత‌ల‌పై గ‌త కొద్ది రోజుల‌గా కొన‌సాగుతున్న దాడుల్లో కొన‌సాగింపుగా దీన్ని ఏపీ నాయ‌కులు చెబుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తెదేపా ని దెబ్బ‌తీయాల‌ని మాన‌సికంగా గేమ్ ఆడుతున్న‌ట్లు ప‌లువురు పేర్కొన్నారు.



Read more RELATED
Recommended to you

Exit mobile version