రాణించిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..!

-

మొహాలీ వేదికగా భారత్‌ – అఫ్గానిస్తాన్‌ మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు అఫ్గాన్‌ బ్యాటర్లను 158 పరుగులకే కట్టడి చేశారు. అజ్మతుల్లా ఒమర్‌జయ్‌ (22 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ,సీనియర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ నబీ (27 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)నిలవడంతో అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్ (33/2)‌, అక్షర్‌ పటేల్‌ (23/2) లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 20 ఓవర్లలో 159 పరుగులు చేయాల్సి ఉంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌కు ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్‌ (22 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్సర్‌),రహ్మనుల్లా గుర్బాజ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) లు తొలి వికెట్‌కు 50 రన్స్ జోడించారు. క్రీజులో కుదురుకున్న వీరిని అక్షర్‌ పటేల్‌ విడదీశాడు. రెండు ఓవర్ల పరిదిలోనే అఫ్గానిస్తాన్ మూడు వికెట్లు తీశారు. అక్షర్‌ పటేల్‌ వేసిన 8వ ఓవర్‌ చివరి బంతికి గుర్బాజ్‌ స్టంపౌట్‌ కాగా,మరుసటి ఓవర్లో శివమ్‌ దూబే.. రెండో బంతికి జద్రాన్‌ ఔట్‌ అవ్వగ,అక్షర్ వేసిన మరుసటి ఓవర్లో రహ్మత్‌ షా (3) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version