దేశవ్యాప్తంగా చిన్న చిన్న వ్యాపారాలు మరియు ప్రజలు ప్రైవేట్ లేదా ప్రభుత్వ బ్యాంకుల వద్ద తమకు అవసరమైన నిమిత్తం రుణాలను తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు బ్యాంక్ నియమ నిబంధనల ప్రకారం రుణాలను తిరిగి చెల్లిస్తారు, మరికొందరు వివిధ కారణాలు మరియు సమస్యల వలన ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో కొన్ని బ్యాంకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాయి, మరియు వారితో ఎటువంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు. వీరి ప్రవర్తన వలన పరువు సమస్యతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం పైన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక సూచనలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ బ్యాంకులకు తెలియచేసింది. రుణాలను చెల్లించని వారిపైన మీ ప్రతాపాన్ని చూపించకండి, ఎటువంటి పరిస్థితుల్లో దురుసుగా ప్రవర్తించవద్దని తెలియచేసింది.
రుణాలను వసూలు చేసే విషయంలో బ్యాంకర్లకు ఆర్ధిక మంత్రి సూచనలు….
-