సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. అకారణంగా వర్మను సెలవుపై పంపుతూ నిర్ణయం తీసుకున్న అంశంపై నేడు సుప్రీంలో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సీవీసీని వివరణ కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టేంత వరకు తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోరాదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేసింది. పదిరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించగా కాస్త సమయం కావాలని సీవీసీ కోరింది. దీంతో స్పందించిన సుప్రీం నవంబర్ 12 వరకు సమయం ఇచ్చింది.
వర్మపై వస్తున్న ఆరోపణలను 10 రోజుల్లోగా తేల్చాలి! సుప్రీం
-