ఈ 2024లో 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను స్విగ్గి నుండి ఆర్డర్ చేసారు హైదరాబాద్ వాసులు. అలాగే దాదాపు 2 లక్షల కండోమ్ లను కూడా ఆర్డర్ చేసారు. అయితే నగరం మొత్తంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన టాప్ 5 వస్తువులు చూస్తే.. పాలు, టమోటాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి. అలాగే 25,00,000 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేసింది హైదరాబాద్. ఇక టూత్ బ్రష్‌ల కోసం స్విగ్గిలో 2.3 కోట్లకు పైగా ఖర్చు చేసింది ఈ నగరం.
అలాగే కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు 31 కోట్లు ఖర్చు చేసారు హైదరాబాద్ వాసులు. అయితే కేవలం పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్‌లు వచ్చాయి స్విగ్గికి. ఇక 1.54 కోట్ల డైరీ, బ్రెడ్ మరియు గుడ్ల ఆర్డర్‌లను చేసారు హైదరాబాద్ లో ఉండే ప్రజలు. అయితే ఈ లెక్కలను తాజాగా విడుదల చేసింది స్విగ్గి. అలాగే తమ కస్టమర్లకు అందరికి కృతజ్ఞతలు తెలిపింది స్విగ్గి యాజమాన్యం.