హెయిర్‌ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌ ఫెయిల్‌ అయిందని ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

-

భూమ్మీదపడ్డ ప్రతి జీవి తనకు కావాల్సిందానికోసం పోరాటం చేయాల్సిందే.. అయితే కొందరు చిన్నచిన్న వాటిని పట్టించుకోరు.. మరికొందరికి అన్నీ కావాలి..అవి దక్కకపోతే ఆగం ఆగం అయిపోతారు. ఈరోజుల్లో చాలామంది అబ్బాయిలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇది చెప్పుకోవడానికి చాలా చిన్న సమస్యగా ఉంటుంది కానీ.. 20-30 ఏళ్లకే జుట్టు అంతా రాలిపోయి.. బట్టతల వస్తే..ముఖం చూసేందుకు ఏమో లేతగా..కానీ పైన జుట్టు లేకపోతే ఆ బాధ పాపం పడేవారికి తెలుస్తుంది. ఓ వ్యక్తి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌లో ఫెయిల్‌ అయిందని ఆత్మహత్య చేసుకున్నాడు.
వేల్స్‌లోని ఆంగ్లేసీలోని లానెర్‌కిమెడ్‌కి చెందిన 47 ఏళ్ల జాన్ గ్విండాఫ్ ఓవెన్ తన తల్లితో జీవిస్తున్నాడు. తలపై వెంట్రుకలు లేకపోవడంతో జాన్…2004 సంవత్సరంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. అయితే అది విజయవంతం కాలేదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ తర్వాత జాన్ తలపై గుర్తులు ఉండిపోయాయి. దీంతో తన తలపై ఉన్న మార్క్స్ ను చూసి ప్రజలు ఎగతాళి చేస్తారేమోనని జాన్ భయపడ్డాడు. దీంతో 2004 సంవత్సరంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు, కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఆ తర్వాత జాన్ తాను నియంత్రించుకొని 27 సంవత్సరాలు కోళ్ల ఫారంలో తన జీవితాన్ని గడిపాడు. గతేడాది ఏమి జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి అతని స్వభావం మారింది.
మళ్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి అదే పనిగా చింతించడం ప్రారంభించాడు. గతేడాది బ్రిడ్జిపై నుంచి దూకి గాయాలపాలై 16 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. జనాలు తన తలపై ఉన్న గుర్తులను చూసి తనని ఆటపట్టించడం మొదలుపెడతారేమోనని మళ్లీ ఆందోళన చెందాడు. తాజాగా తన ఇంట్లోని షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
2004 తర్వాత నుంచి జాన్.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో అనే వ్యాధితో బాధపడుతున్నాడని డాక్టర్లు పరిశోధనలో తెలిపారు. ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య పరిస్థితి. ఒక వ్యక్తి తన శరీరం, ముఖం లోపాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుండట ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దీనితో పాటు, జాన్‌కు డిప్రెషన్ కూడా  సమస్య కూడా ఉంది, దాని కారణంగా అతని పరిస్థితి మరింత దిగజారిందని డాక్టర్లు తెలిపారు.
మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనేది నరకం లాంటింది.. నీకు నువ్వే నచ్చకపోతే ఎలా..? జాన్‌ తన జీవితాన్ని ఒక అపరాధ భావంతో గడిపాడు..సంతోషంగా లేకుండా..ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో బతికాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా ధృడంగా ఉంటేనే

Read more RELATED
Recommended to you

Exit mobile version