అత్తాపూర్ లో బుధవారం మధ్యాహ్నం సమయంలో నడిరోడ్డుపై దారుణంగా ఓ వ్యక్తిని హతమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతీకార హత్యగా జరిగిన ఈ హత్య నగరవాసుల్ని భయకంపితుల్ని చేసింది. దుండుగులు వెంటాడి వేటాడి యువకుణ్ని హతమార్చారు. కసిదీరా నరికి చంపిన తర్వాత విజయగర్వంతో చేతులు పైకేత్తి వికట్టహాసాలు చేశారు. అంతకు ముందు వారం క్రితం ఓ తండ్రి తనకూతురు ప్రేమ పెళ్లిని వ్యతిరేకించి ఎర్రగడ్డ వద్ద కూతురు అల్లుడిపై దాడి చేయడం కూడా సంచలనం రేపింది.
ఈ వరుస సంఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్ .. ఘటనలతో నగర ప్రజలు షాకయ్యారు. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, సైబరాబాద్ సీపీ, రాచకొండ పోలీసులు పరిస్థితిని సమీక్షించాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులకు ఆయుధాలు అందించాలి. వెంటనే అప్రమత్తమై, స్పందించేలా వారికి తగిన శిక్షణ అందించాల’ని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.
Received many comments & suggestions from shocked & exasperated netizens on the two violent incidents in our city
Request @TelanganaDGP and @CPHydCity @cpcybd @RachakondaCop to review & equip the policemen on ground with adequate training so they can be alert & responsive
— KTR (@KTRTRS) September 27, 2018