కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. మన దేశంలో 47 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్ చేయబడ్డాయి. ఈ ఖాతాల ద్వారా చాలా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం రూ.10,000 ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. మీ శాఖలో దరఖాస్తు చెయ్యవచ్చు.
రూ. 1 లక్ష 30,000 వరకు బీమా లభ్యత వంటి ఇతర ప్రయోజనాలు ని కూడా పొందవచ్చు. దీని గురించి మీకు తెలీకపోతే వివరాలను తెలుసుకోండి. ఈ ఖాతా లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పని లేదు.
రూపే డెబిట్ కార్డ్ అదనంగా ఇస్తారు. ఈ ఖాతాలో రూ. 10,000 ఓవర్‌డ్రాఫ్ట్ కోసం బ్యాంకుకు దరఖాస్తు చెయ్యచ్చు. మీరు మీ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్లి సంప్రదించాల్సి ఉంది. ప్రభుత్వం రూ. 1 లక్ష ప్రమాద బీమా పాలసీ తో సహా ఇంకా ప్రయోజనాలను అందిస్తుంది.
దానితో పాటుగా అదనంగా మీకు రూ. 30,000 జీవిత బీమా పాలసీ ఇస్తారు. ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు మరణిస్తే ఖాతాదారుని కుటుంబానికి లక్ష రూపాయిలు బీమా సౌకర్యం ని ఇస్తారు. ఒకవేళ కనుక సాధారణ పరిస్థితుల్లో కనుక మరణిస్తే రూ. 30,000 బీమా కవర్ మొత్తం అందించబడుతుంది. సమీప బ్యాంక్ శాఖలో జన్ ధన్ ఖాతాను వెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పాన్ కార్డ్ తప్పక ఉండాలి.