ఇప్పటికే తెలంగాణ లో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లతున్నాయి. నగరం లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే రాష్ట్రంలో మరో పది రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి మరో అల్పపీడనం ముప్పు ఉందని తెలిపింది.
ఈనెల 11న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దాంతో 12నుండి మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాని ప్రభావం తో తెలంగాణ లోని మంచిర్యాల, పెద్దపల్లి,ఖమ్మం, వరంగల్, కొమురం భీం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.