రాష్ట్ర హై కోర్టుకు కొత్త‌గా 10 మంది జ‌డ్జీలు.. కొలీజియం సిఫార‌సుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హై కోర్టుకు మ‌రో 10 మంది కొత్త జ‌డ్జీలు రానున్నారు. తెలంగాణ హై కోర్టు కోసం కొలీజియం సిఫార‌సు చేసిన 12 మందిలో కేంద్ర ప్ర‌భుత్వం 10 మంది జ‌డ్జీల నియ‌మ‌కానికి ఆమోదం తెలిపింది. కాగ ఈ 10 మంది కొత్త జ‌డ్జీల ఆమోదం కోసం రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు కేంద్ర ప్ర‌భుత్వం పంపించింది. కాగ వీరికి రాష్ట్రప‌తి అతి త్వ‌ర‌లోనే ఆమోద ముద్ర వేయ‌నున్నారు. దీంతో ఈ నెల 23న తెలంగాణ హై కోర్టుకు కొత్త‌గా వ‌స్తున్న 10 మంది న్యాయ‌మూర్తులు ప్ర‌మాణం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగ తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో గ‌తంలో చీఫ్ జ‌స్టీస్ తో క‌లిపి మొత్తం 19 మంది న్యాయ‌మూర్తులు ఉండే వారు. కానీ గ‌రిష్టంగా ఉండాల్సింది.. 32 మంది. అలాగే ఇటీవ‌ల సుప్రీం కోర్టు హై కోర్టుల‌లో న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను 32 నుంచి 42 కు పెంచింది. దీంతో తెలంగాణ హై కోర్టుకు 10 మంది కొత్త న్యాయ‌మూర్తులు వ‌స్తున్నారు. ఇంకా తెలంగాణ హై కోర్టులో న్యాయ‌మూర్తుల పోస్టులు 13 ఖాళీగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version