తెలంగాణ కు మరో 100 ఆక్సీజన్ ప్లాంట్లు..!

-

కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వెబ్ డేంజర్ బెల్స్ మోగించింది. ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో మరణాలు లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వెవ్ ఎఫెక్ట్ భారత్ పై ఎక్కువగా పడింది. అయితే కరోనా వల్ల ఎక్కువ మరణాలు ముఖ్యంగా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్లే సంభవించాయి. దాంతో థర్డ్ వేవ్ వస్తే ఆక్సిజన్ కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కేంద్రం 50 ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేసింది.

అయితే రాష్ట్రం లో కొత్తగా మరో వంద ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆక్సీజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు 35 ఆక్సీజన్ ప్లాంట్ లను అందించాయి. ఈ ఆక్సిజన్ ప్లాంట్ లను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇవి కాకుండా మరో 100 ఆక్సిజన్ ప్లాంట్ లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version