తెలంగాణలో 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దీని కోసం తాజాగా నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ పోస్టులకి మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటో మొబైల్ స్పెషలైజేషన్‌ లో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే హెవీ మోటారు వాహన డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పక ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు జులై 1, 2022వ తేదీ కి 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఫిబ్రవరి 1, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. జనవరి 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

రాత పరీక్ష రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే.. అభ్యర్ధులు రూ.320లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్‌ 23, 2023న ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే… రూ.45,960ల నుంచి రూ.1,24,150ల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలని https://websitenew.tspsc.gov.in/directRecruitment లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version