తెలంగాణ రాష్ట్రం లో గడిచిన 24 గంటలలో కొత్త గా 146 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 6,78,288 కి చేరింది. అలాగే రాష్ట్రం లో గడిచిన 24 గంటల లో కరోనా మహమ్మరి కాటు కు ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణం గా 4,007 మంది మరణించారు. అలాగే ఈ రోజు కరోనా వైరస్ ను 189 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
దీంతో రాష్ట్రం లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,70,435 కి చేరింది. కాగ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో 98.84 శాతం తో రీకవరీ రెటు ఉంది. అలాగే రాష్ట్రం లో ప్రస్తుతం 3,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటల లో రాష్ట్ర వ్యాప్తం గా 26,625 శాంపిల్స్ ను పరీక్షించారు. అలాగే 3,123 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రం లో ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేవని కూడా తెలిపింది.