క్యారెట్లను బాగా వేయించి తీసుకోవడం వల్ల రుచికరమైన స్నాక్స్ తినడమే కాక, మీ గుండెకు కావాల్సిన ఫ్యాట్‌ను అందించిన వారవుతారు.
గుమ్మడికాయ గింజల్లో అధికంగా లభించే మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ తగ్గించడమే కాక.. గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వీటిని చక్కగా వేయించుకుని వాటికి నట్స్ లాంటివి జత చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ మీ సొంతం.
ఆకుకూరల్లో చాలా న్యూట్రియన్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతోపాటు వీటిలో ఉండే పొటాషియం రక్తప్రసరణ తగ్గిస్తాయి.
చాలా మంది పాల పదార్థాలు గుండెకు మంచివి కాదంటారు. కానీ నిజానికి పెరుగు గుండెకు చాలా మంచిదని తాజాగా చేసిన స్టడీలు చెబుతున్నాయి.
కందికాయను సాధారణంగా సరదాగా తింటారు. కానీ నిజానికి ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయట. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, పాలీ-అన్ సాచురేటెడ్ ఫ్యాట్, ఫైటో న్యూట్రియన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటికి కాస్త నిమ్మరసం, పిప్పర్ లాంటివి జత చేసుకుని తింటే మీ స్నాక్స్ అదుర్స్.