సామాన్యులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఇండియా వ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. 19 కిలోల సిలిండరు ఏకంగా 250 రూపాయలు పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర 2253 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి.
డొమెస్టిక్ (గృహ అవసరాల కోసం) సిలిండర్ల ధర మాత్రం పెంచలేదు. ఏప్రిల్ ఒకటో తేదీన ధరలు సవరణలు చేస్తామని… అందులో భాగంగానే ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి.
19 kg commercial cooking gas LPG price hiked by Rs 250 per cylinder. It will now cost Rs 2253 effective from today. No increase in the prices of domestic gas cylinders. pic.twitter.com/h8acfRh6mn
— ANI (@ANI) April 1, 2022