తెలంగాణలో ఈ ఏడాది 2.34,158 కేసులు నమోదు

-

రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన క్రైమ్ రేటును తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 2.34,158 కేసులు నమోదు అయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలీస్తే 2024లో మొత్తంగా 9.87 శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం 1,942 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయని వివరించారు.

ఇక 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన విడుదల చేస్తూ రూ.142.50 కోట్ల విలువైన మాదక ద్ర్యవ్యాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఒకటి, రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ తెలిపారు. కాగా, ఆదిలాబాద్‌లో ట్రైబల్ మహిళా అత్యాచారం, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసం జరిగిన క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news