తల్లి శవానికి రెండురోజులుగా పూజలు చేసిన కూతుర్లు.. బతికొస్తుందని పోలీసులనే బెదిరించిన వైనం

-

టెక్నాలజీ ఇంతలా పెరిగినా..కొందరు ఇంకా మూడనమ్మకాలు, వింత ఆచారాలు మాత్రం వదలటం లేదు. వాళ్ల పిచ్చి కొన్నిసార్లు కన్నకూతూర్ళను చంపేవరకూ వెళ్తే..మరికొన్నిసార్లు అదే మూఢనమ్మకంతో చనిపోయిన తల్లిని బతికించగలం అనుకునేవరకూ దారితీస్తుంది. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే ఏంట్రావీళ్లు అనిపిస్తుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఓ తల్లి చనిపోయింది. తమ తల్లి చనిపోయినప్పటికి తిరిగి బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహాహం వద్దే ఆమె కూతుల్లు మూడు రోజులుగా పూజలు చేశారు. మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ (75) తన కుమార్తెలు జయంతి (43), జెసిందా (40)తో కలిసి ఉంటోంది. గత వారం మేరీకి ఆరోగ్యంబాలేక తిరుచ్చి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
దీంతో చనిపోయిన తమ తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిన కూతుళ్లు విచిత్రంగా వ్యవహరించారు. ఇక్కడ వీరిది అమ్మ మీద ప్రేమ లేక మూఢనమ్మకమో తెలియదు కాని… తల్లి బతకాలని ఇక పూజలు మృతదేహం వద్ద పూజలు చేయడం మొదలుపెట్టారు. అదేదో పాతసినిమాల్లో చేస్తారుగా…లోయలో పడేసినా తిరిగి బతికివస్తాడు, యుముడినే ఎదురించి ప్రాణాలను కాపాడటం ఇలాంటివి నిజంగా జరుగుతాయనుకున్నారేమో ఆ కూతుళ్లు..మృతదేహం వద్ద వింతవింతగా పూజలు చేశారు. ఇదందా చూసిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు బాబ్భైలు ఘటనా స్థలానికి చేరుకున్న ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.. రెండు రోజుల క్రితమే మేరీ చనిపోయినా, ఆమె బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు పూజలు చేయటం చూసి వారికి ఫీజులు ఎగిరిపోయాయి.
పోలీసులు వెళ్లి ఇదంతా చేయకూడదు, ముందు మృతదేహాన్ని పూడ్చిపెట్టాలి అని అభ్యంతరం చెప్పినా వారికే చుక్కలు చూపించారు ఈ కూతుళ్లు.. తమ తల్లి బతికే ఉందని, త్వరలో నిద్ర లేచి వస్తుందని చెప్పిన కుమార్తెలు పోలీసులను తిరిగి వెనక్కి పంపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మేరీ మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. చివరికి ఎలానో మేరీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.
ఇదీ జరిగింది.. మూఢనమ్మకాలు, దొంగబాబాల చేతిలో ఇంకా మోసపోతూనే ఉన్నారు కొందరు అమాయకులు. జ్ఞానాన్ని ఇచ్చే చదువుకంటే ఈ వింత నమ్మకాలే వీరికి నచ్చుతున్నాయి. మొత్తానికి ఆ మృతదేహాన్ని అయితే పోలీసులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. లేకుంటే ఈ కూతుర్లు ఎన్నిరోజలు ఇలా పూజలు చేసేవాళ్లో.

Read more RELATED
Recommended to you

Exit mobile version