తిరుమలకు వీఐపీల తాకిడి.. టీటీడీపై భగ్గుమంటున్న సామాన్యులు

-

వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలకు వీఐపీల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్నారు. దీంతో గంటల తరబడి లైన్లో వేచిచూస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి వెనుక మరొకరు వీఐపీ దర్శనం కోసం వస్తుంటే సామాన్యలను ఎక్కడికక్కడే ఆపేస్తున్నారు.

మరోవైపు లైన్లలో నిలబడి సామాన్యుల ప్రాణాలు పోతున్నా తిరుమలలో వీఐపీ దర్శనాలు ఆపరా? అని కొందరు టీటీడీపై ఫైర్ అవుతున్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని పలువురు వీవీఐపీలు దర్శించుకున్నారు. వారిలో..

 

రాందేవ్ బాబా, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ మాజీ మంత్రి మల్లా రెడ్డి,
తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, ఏపీ హోంమినిస్టర్ అనిత,ఏపీ రాష్ట్రమంత్రి కొలుసు పార్థసారథి, ఏపీ రాష్ట్రమంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఏపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*, ఏపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ ఎంపీ డీకే అరుణ, ఏపీ రాజ్య సభ ఎంపీ ఆర్.కృష్ణయ్య

సినీ ఇండస్ట్రీ నుంచి బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ నటుడు సప్తగిరి,
సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి, చాముండేశ్వరి నాథ్ & బ్యాట్మెంటన్ పుల్లెల గోపీచంద్, YSRCP వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version