20 కేజీల కొండచిలువను భ‌లే ప‌ట్టేసిందిగా.. వైరల్ వీడియో

-

సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కాని ఒక మహిళా మాత్రం తెలివిగా 20 కిలోల బరువైన కొండచిలువను దాన్ని ప్రాణాలతో బంధించి, తనలోని ధైర్యాన్ని చూపించింది. కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ‌ వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన విద్య అనే యువతి ఎర్నాకుళంలో నివాసం ఉంటోంది. తన ఇంటి వెనుకవైపున్న స్థలంలో పెద్ద కొండచిలువ ఉందన్న విషయాన్ని కొందరు గమనించడంతో ఆందోళన మొదలైంది.

గతంలో పాములను పట్టడంలో కాస్తంత అనుభవమున్న విద్య, కొండచిలువ మెడను చాకచక్యంగా పట్టుకుని, మరో ఇద్దరి సహకారంతో ఓ సంచీలో పెట్టి బంధించేసింది. దీన్ని హరిందర్ సిక్కా అనే యువకుడు వీడియో తీసి, తన ట్విట్టర్ ఖాతాలో ఉంచగా, ఆమె చూపించిన ధైర్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మ‌రియువిద్య ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు. చాలా ధైర్యవంతురాలు అని మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version