తెలంగాణ 2022-23 బడ్జెట్ రూ. 2,56,958 కోట్లు… వివిధ పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు ఇలా…

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ 2022-23 బడ్జెట్ లో రూ. 2,56,958 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో రెవెన్యూ వ్యయం రూ. 1,89,274.82 కోట్లు కాగా… క్యాపిటల్ వ్యయం రూ. 29,728.44 కోట్లుగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రతిష్టాత్మక పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. ఇటు సంక్షేమంతో పాటు అటు డెవలప్ మెంట్ పనులకు కూడా నిధులను కేటాయించారు. ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 2750 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 12000 కోట్లు, మన ఊరు- మనబడికి రూ. 7289 కోట్లు, దళిత బంధుకు 17,700 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 12565 కోట్లు, బీసీల సంక్షేమం కోసం రూ. 5698 కోట్లు, బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు, హరిత హారానికి రూ.938 కోట్లు, పామాయిల్ సాగకు రూ.1000 కోట్లు, కొత్త మెడికల్ కాలేజీకి రూ. 1000 కోట్లను, గిరిజన సంక్షేమం కోసం రూ. 12565 కోట్లను కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version