21 రోజులు లాక్‌డౌన్‌.. ఈ టిప్స్‌తో అధిక బ‌రువు త‌గ్గ‌డం చాలా తేలిక..!

-

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చాలా మంది చూస్తుంటారు. కానీ నిత్యం వ్యాయామం చేసేందుకు, స‌రైన పౌష్టికాహారం తీసుకునేందుకు టైం కుద‌ర‌డం లేద‌ని వాపోతుంటారు. అయితే ప్ర‌స్తుతం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో అధిక బ‌రువును చాలా తేలిగ్గా త‌గ్గించుకోవచ్చు. రోజులో 24 గంట‌ల పాటూ ఇంట్లోనే ఉంటారు క‌నుక‌.. వ్యాయామం చేస్తూ.. టైముకు పోష‌కాహారం తీసుకుంటే.. 21 రోజుల్లో  అధిక బ‌రువు చాలా తేలిగ్గా త‌గ్గుతుంది. మ‌రి అధిక బ‌రువు త‌గ్గాలంటే ఈ 21 రోజులూ.. నిత్యం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
21 days lockdown follow this diet plan to reduce over weight
* నిత్యం ఉద‌యాన్నే 7 సార్లు సూర్య న‌మ‌స్కారాలు చేయాలి.
* ముందు రోజు రాత్రి నీటిలో నాన‌బెట్టిన బాదంపప్పు, కిస్మిస్‌ల‌ను తినాలి.
* ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వేడి వేడి ఉప్మా తినాలి.
* ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌కు, మ‌ధ్యాహ్నం లంచ్‌కు న‌డుమ లెమ‌న్ వాట‌ర్ తాగాలి. (ష‌ర్బ‌త్ కూడా తీసుకోవ‌చ్చు.)
* మ‌ధ్యాహ్నం లంచ్‌లో స‌బుదాన వ‌డ‌, హోమ్ మేడ్ చ‌ట్నీ లేదా స‌బుదాన కిచిడీ పెరుగుతో తినాలి.
* లంచ్ అనంత‌రం మర‌మ‌రాలు తినాలి. లేదా వాటిని నేతిలో వేయించి తిన‌వ‌చ్చు.
* సాయంత్రం డిన్న‌ర్ చాలా త్వ‌ర‌గా పూర్తి చేయాలి. జీరా రైస్  లేదా మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌వ‌చ్చు. లేదా దాల్ రైస్,  కిచిడీల‌ను కూడా తిన‌వ‌చ్చు.
* రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు ఒక గ్లాస్ పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. లేదా అల్లం టీ తాగ‌వ‌చ్చు.

21 రోజుల పాటు ఈ డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని డైటీషియ‌న్లు చెబుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version