బ‌ద్రి మూవీకి 21ఏళ్లు.. అరుదైన ఫొటో షేర్ చేసిన రేణూదేశాయ్‌

-

నువ్వు నందా అయితే నేను బ‌ద్రి, బ‌ద్రినాథ్‌.. ఈ డైలాగ్ ఇప్ప‌టికీ ప‌లు సంద‌ర్భాల్లో వాడుతుంటారు. నందా, బ‌ద్రినాథ్ ప్లేస‌లో వారి పేర్లు మార్చుకుని కుర్ర‌కారు వాడుతుంటారు. ఇక ఈ సినిమాతోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ స్టార్ గా మారాడు. దీని త‌ర్వాత ఇండ‌స్ట్రీలో ఆయ‌న అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరి.. ఏ స్థాయికి ఎదిగాడో చెప్ప‌క్క‌ర్లేదు.

పవన్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం బ‌ద్రి. ఈ మూవీ ప‌వ‌న్ ను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇక పూరి కూడా ఈ సినిమాతో బంప‌ర్ ఆఫ‌ర్లు అందుకున్నాడు. ఒక దాని తర్వాత మరొకటి హిట్ కొడుతూ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా ఎదిగాడు.


ఈ మూవీలో అమీషా పటేల్, రేణూ దేశాయ్ లు హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా, పవన్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది రేణూ దేశాయ్‌. ఈ మూవీ త‌ర్వాత వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక ఈ సినిమా వచ్చి నేటికి 21 ఏళ్లు పూర్తి కావడంతో అప్పటి ఓ బ్యూటిఫుల్ ఫోటోను రేణుదేశాయ్ షేర్ చేశారు. ఈ మూవీలో “హే చికితా” షూట్ లో గన్ పట్టుకొని ఉన్న ప‌వ‌ర్‌స్టార్‌ ముందు దుప్పట్టాలో తాను ఉన్న ఫోటోను షేర్ చేసింది న‌టి రేణూ దేశాయ్‌. దీంతో మెగా అభిమానులు తెగ కుషీ అవుతున్నారు. బ‌ద్రి మూవీలోని ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌ను షేర్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version