కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఇవాళ.. మత్స్యకార భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.ఎం జగన్ మాట్లాడుతూ….. కొత్తగా చేపట్టిన 9 ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా పూర్తి చేస్తామని.. త్వరలో విశాఖ జిల్లా భీమిలిలో 250 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
మల్లాడి సత్యలింగ నాయకర్ స్ఫూర్తితో ప్రభుత్వం అడుగులు వేస్తుందని.. అన్ని వర్గాల్లోని పేదలను నా వాళ్లుగా భావించానన్నారు. వారి కోసం 32 పథకాలను ప్రభుత్వమని.. వరుసగా నాలుగో ఏడాదితో కలిపి 419 కోట్లు రూపాయలు సహాయం చేసామని వెల్లడించారు.
దేశ చరిత్రలో ఇలాంటి సహాయం ఎప్పుడూ లేదని.. ఈ ఏడాది 1లక్ష 9వేల మందికి మత్స్యకార భరొసా ద్వారా 109 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీలు, బి.సి.లు, ఉన్నత వర్గాల్లో పేదలను ఆదుకోవడానికి నేను ఉన్నాననే ముందడుగు అని.. వీరందరినీ ఆదుకోవడం కోసం 30 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. చేపల వేట విరామం రోజుల్లో మత్స్యకార కుటుంబాలకు పది వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు.