సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 26.885 కేజీల గంజాయి లభ్యం

-

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు.నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి వద్ద తనిఖీలు చేపట్టారు. అతని బ్యాగ్ పరిశీలించగా అందులో 26.885కేజీల గంజాయిని గుర్తించారు. అనంతరం బ్యాగ్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/bigtvtelugu/status/1897124643338903754

Read more RELATED
Recommended to you

Latest news