పేదలకు కెసిఆర్ శుభవార్త..సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు

-

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. సొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేసుకునేవారికి ఏకంగా మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ఇవాళ అసెంబ్లీ వేదికగా మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. సంతోష్ స్థలం ఉన్న నాలుగు లక్షల మందికి మూడు లక్షల రూపాయల చొప్పున సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు.

నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల చొప్పున ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లను కేటాయిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాగే నిర్వాసితులు మరియు ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. అటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు.

అలాగే…రూ.75 లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. అలాగే.. దళిత బంధు కోసం 17700 కోట్లు, ఎస్టీ సంక్షేమం 12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం 5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, శది ముబారక్ లకు 2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు 11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు 12 వేల కోట్లు బడ్జెట్ లో పెడుతున్నట్లు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version