మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం పలికితే..తాను రానంటూ లేఖ రాయడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని.. కేసీఆర్ పాకిస్తాన్ వాళ్లల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె రాకపోతే సందేశం పంపొచ్చన్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అమరవీరుల స్థూపం వద్దకు తాను వెళ్లాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని అన్నారు .ప్రజల్లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని, అమరవీరుల ఆనవాళ్లపై బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత ద్వేషమని మండిపడ్డారు.కేటీఆర్‌కు కరెంట్ షాక్ ఇవ్వాలని, హరీష్ రావు చిల్లర పనుల వల్లే పవర్ కట్ అవుతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సబ్ స్టేషన్‌కు వెళ్లి లాక్ బుక్ చూడటానికి తాను సిద్దం అని.. దానిపై చర్చకు కూడా సిద్ధమన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సమస్యలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.