ఆ నలుగురిని సింగిల్ సెల్స్ లో …ఆ సింగిల్ సెల్స్ అంటే…? భయంకరమా…?

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలు దిశా అత్యాచార౦ హత్య కేసులో నిందితులను పోలీసులు చర్లపల్లి జైల్లో ఉంచారు. ఇక వారిని తోటి ఖైదీలు చంపకుండా కట్టుదిట్టమైన భద్రతలో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా జైల్లో రిమాండ్ లో ఉంచే వరకు కూడా వారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇక వారిని చర్లపల్లి జైల్లో సింగల్ సెల్స్ లో ఉంచారు జైలు సిబ్బంది… ప్రమాదకరంగా భావించే డ్రగ్స్ కేసుల నిందితులు, జైలు సిబ్బంది మీద దాడి చేసే నిందితులు,

ఉగ్రవాదులతో సంబంధాలు ఉండే వారిని సింగల్ సెల్స్ లో పెడుతూ ఉంటారు. ఇక ఈ సింగల్ సెల్స్ ఒకరకంగా భయంకరమైన, నరకమని అధికారులు చెప్తున్నారు. వాటిల్లో మనిషి చావలేడు, బ్రతకలేడు అంటున్నారు. ఆ నలుగురికి తోటి ఖైదీల నుంచి ప్రాణాపాయం ఉన్న నేపధ్యంలో సింగల్ సెల్స్ లో ఉంచారు. చర్లపల్లి జైల్లో… మూడు అంతస్తుల్లో మూడు బ్యారేక్ లు ఉండగా… ఒక్కో బ్యారేక్ 4 నుంచి 8 హాళ్ళు ఉంటాయి… ఒక్కొక్క హాల్ లో… 14 నుంచి 32 మంది వరకు నేరస్తులను అధికారులు ఉంచుతారు.

వీరు సాధారణ నేరస్తులు… అంటే నేర తీవ్రత తక్కువ ఉండే వాళ్ళు. జైల్లో అధికారులు అప్పగించే పనులు పూర్తి చేసుకుని… ఆ హాళ్లల్లో ఉంటారు… అయితే… సింగల్ సెల్స్ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉంటాయని అధికారులు అంటున్నారు. అసలు అక్కడ ఏ సదుపాయాలు ఉండవని, మరో ఖైదీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదని అంటున్నారు. కనీసం బయటి వెలుతురు కూడా అందులోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు, సెల్ కి వెనుక వైపు 13 అడుగుల ఎత్తులో ఒక వెంటిలేటర్ ఉంటుంది…

ఇక ఆ సెల్ లోనే కాలకృత్యాలు తీర్చుకునే౦దుకు గాను గోడ చాటున ఒక చిన్న బాత్ రూమ్ ఉంటుంది. జైల్లో ఏం జరుగుతుంది అనే విషయం కూడా వారికి తెలియదు. భోజనం, టీ, టిఫిన్ మాత్రమే సమయానికి వస్తాయి… వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు గాను… స్పూన్, గ్లాసు, ప్లేటు, బాత్ రూమ్ లో బకెట్ కూడా వాళ్లకు ఉండదు. ఇక కారిడార్ లో వెలిగే ఒక లైటు కాంతి మాత్రమే బ్యారేక్ లో పడేలా ఏర్పాటు చేస్తారు. కనీసం ఫ్యాన్ కూడా ఉండదు. ఎలాంటి చర్యలకు పాల్పడే అవకాశం కూడా లేకుండా వారిని కాపలా కాస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version