అక్క‌డ స్మోక్ చేయని ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఆరు రోజుల అదనపు సెలవులు

-

జపాన్ కి చెందిన ఓ కంపెనీ త‌మ ఆఫీసులో పనిచేసే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు బంపరాఫర్ ప్ర‌క‌టించింది. తమ కంపెనీ ఉద్యోగులు ఎవరైతే స్కోకింగ్ చేయరో వారికి ఆరు రోజులు అదనంగా సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే పియల ఇంక్ అనే సంస్థ ఓ ఉద్యోగి ఫిర్యాదు అనంతరం ఈ పాలసీని తీసుకొచ్చింది. కంపెనీ ఆఫీస్ 26వ ఫ్లోర్ లో ఉంటుంది. దీంతో ఉద్యోగులు సిగరెట్ బ్రేక్ తీసుకోవాలంటే బేస్ మెంట్ తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది.

కిందకి వెళ్లి సిగరెట్ తాగి పైకి వచ్చేసరికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఇలా ప్రతిసారీ వాళ్లు 15 నిమిషాలు సమయం తీసుకుంటుండటంతో స్కోక్ చేయని ఉద్యోగులపై పని ఒత్తిడి పడుతుందంట. ఇంత సమయం వృద్ధా అవుతుండటం కంపెనీ ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుందని ఓ ఉద్యోగి కంపెనీ సీఈవో టకావో అసుకాకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగి కంప్లెయింట్ పై స్పందించిన సీఈవో ఓ పాలసీని తీసుకొచ్చారు. స్కోకింగ్ చేయని ఉద్యోగులకు పరిహారంగా ఆరు రోజులు అదనంగా వేతనంతో కూడా సెలవు ఇవ్వాలని సీఈవో నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version