బ్యాంకాక్, మయన్మార్‌లో భూకంపాలు విలయం సృష్టించాయి.శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో బ్యాంకాక్‌లో పెద్దఎత్తున భవనాలు నేలకూలాయి. వరుసగా రెండు పవర్ ఫుల్ భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలింది.అంతేకాకుండా బ్యాంకాక్‌లో మెట్రో,రైలు సర్వీసులు నిలిపివేశారు. వెంటనే థాయ్ ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భూకంపం వచ్చాక 43 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కొందరు భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 20కు పైగా ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది.