గత మూడేళ్లలో వైద్యశాఖలో 45 వేల మందిని నియమించాం – ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

-

గత మూడేళ్లలో వైద్య శాఖలో సుమారు 45 వేల మందిని నియమించామన్నారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్. టి కృష్ణ బాబు. దాదాపు 5 వేల వరకు వైద్యులను నియమించామన్నారు. 5 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి, విజయనగరం, నంద్యాలలో ఈ మెడికల్ కాలేజీలు రానున్నాయని తెలియజేశారు. గర్భిణీలు, బాలింతలకు వైద్య చికిత్స అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

అందుకే రెండు సార్లు కచ్చితంగా స్కానింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ ద్వారా 16,257 కోట్ల రూపాయలతో వైద్య యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తంగా 160 సదుపాయాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి లేబర్ రూం మెరుగైన సదుపాయాలు ఉండే విధంగా లక్ష్య కార్యక్రమం కింద చేపట్టామన్నారు.

కొన్ని చోట్ల నిపుణుల కొరత ఉందన్నది వాస్తవమేనని.. తాజాగా గైనకాలజిస్ట్‌లు, అనస్థీషియలిస్ట్‌లు వంటి కొంత మంది నిపుణుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నామన్నారు. రిమోట్ ప్రాంతాల్లో పని చేయటానికి నిపుణులు, వైద్యు లు ముందుకు రావటం లేదనే కారణంతో అటువంటి ప్రాంతాల్లో పని చేయటానికి 50 శాతం, 30 శాతం అదనపు ప్రయోజనాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version