చంద్రబాబుకు షాక్.. మొత్తం 5 కేసులు నమోదు !

-

 

చంద్రబాబుపై తాజాగా మద్యం కేసుతో కలిపి ఇప్పటికీ ఐదు కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంశాల్లో సిఐడి, అంగళ్లు ఘర్షణపై పోలీసులు కేసులు పెట్టారు. స్కిల్ కేసులో సిఐడి అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు.

ఆ FIRను కొట్టేయాలంటూ CBN వేసిన క్వాష్ పిటిషన్ పై SC తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా… ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఇవాళ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్‌ మంజురు చేసింది కోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version