ఏపీలో 50 ఏళ్ళు లోపు వారికి ఇంట్లోనే చికిత్స…!

-

కేంద్రం సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళు.. వ్యాధి సోకినా ఆ లక్షణాలు లేని వారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. 50 సంవత్సరాల్లోపు వారు.. నిర్ధారించిన పరీక్షల్లో ఆరోగ్యవంతులుగా ఉంటే మాత్రమే వారికి వారికి వైద్యుల సూచనతో ఇంట్లో ఉండి చికిత్స పొందే విధంగా అనుమతి ఇస్తారు.

రక్తపరీక్షలు, మధుమేహం, సీరం క్రియాటిన్‌, చెస్ట్‌ ఎక్స్‌రే, ఈసీజీ, ఎసీపీఓ2 పరీక్షలు చెయ్యాల్సి ఉండగా.. ఈ పరీక్షల్లో ఏమైనా తేడా ఉండి అనుమానంగా ఉంటే ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు.

మార్గదర్శకాలు ఏంటీ అనేది చూస్తే…

కరోనా రోగి నివాసం ఆస్పత్రికి సమీపంలో ఉండాలి.

అపార్టుమెంట్లలో నివసించేవారికి ఇంట్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉండదు.

ఒకవేళ ఉమ్మడి కుటుంబంలో ఉన్నా సరే దీనికి అనుమతి ఉండదు.

కరోనా లక్షణాలున్న వ్యక్తి ఇంట్లో 60 సంవత్సరాలు, అంతకు మించి వయసున్నవారు ఉన్నా సరే అనుమతి ఉండదు.

కచ్చితంగా ప్రత్యేకంగా గది, మరుగుదొడ్డి ఉండాల్సిందే.

రోగి ఆరోగ్య స్థితిని సంరక్షకులు రోజుకు రెండుసార్లు గమనించడమే కాకుండా సపర్యలు చేసేటప్పుడు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాల్సి.

అదే విధంగా వైద్యులతో వీడియో కాల్ మాట్లాడాల్సి ఉంటుంది.

మానసిక గందరగోళం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారితే వ్యాధి తీవ్రత పెరిగినట్టు…

బాధితుల శరీర ద్రవాలు, నోటి ద్వారా వచ్చే తుంపర్లకు కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

వైరస్‌ నిర్ధారణ జరిగిన 14, 15 రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version