సెల్ఫి దిగడానికి కొండ ఎక్కి కింద పడి చనిపోయిన మహిళ…!

-

లాక్ డౌన్ నుంచి విముక్తి లభిస్తే కొత్త జన్మ ఎత్తినట్టే ఫీల్ అవుతున్నారు కొందరు. ఇన్నాళ్ళు ఇళ్ళలలో నరకం చూసి ఇప్పుడు బయట ప్రపంచానికి రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ ఆనందమే ఒక మహిళ ప్రాణాలను తీసింది. సెల్ఫి తీసుకోవడానికి కొండ ఎక్కి నీటిలో పడిపోయింది ఒక మహిళ. కజకిస్థాన్‌కు చెందిన 31 ఏళ్ల ఒలేసియా సుస్పిట్సినా అనే మహిళ… టర్కీ వెళ్ళింది.

నగరంలోని అంటాల్యాలోని డుడెన్ పార్కుకు వెళ్లి అక్కడ ఇరుక్కుపోయింది. లాక్ డౌన్ ని ఎత్తేయడంతో తాను ఎంతో ఇష్టపడే కొండ ప్రాంతానికి వెళ్ళింది. ఫోటోలు దిగడానికి గానూ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ పలు జలపాతాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆ మహిళ 115 అడుగుల క్రింద నేలమీద పడిపోయింది. ఆమె పడిపోవడం గమనించిన స్నేహితుడు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు రంగంలోకి దిగి ఆమెను కాపాడాలి అని చూసినా ఆమె అప్పటికే మరణించింది.

గత ఏళ్ళుగా ఈ మహిళ టర్కీ నగరంలో టూర్ గైడ్‌గా పనిచేసిందని డైలీ మెయిల్ పేర్కొంది. ఆమె అక్కడి సుందరమైన ప్రదేశాల్లో ఆమె తిరిగినట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫోటోలు ఉన్నాయి. ఎత్తైన కొండలపై ఆమె ఫోటోలు కూడా దిగడం విశేషం. “నేను ఎప్పుడూ టర్కిష్ ప్రకృతి అందాలను ఆరాధిస్తాను. ఇది నా స్వర్గం, ” అని ఆమె ఒక ఫోటో కి కామెంట్ చేసారు. ఆమె సముద్రాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతుందని ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న ఫోటోలు చూసి అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version