దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం విదితమే. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా 70కి చేరుకుంది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా అనుమానితుల నుంచి రక్త నమూనాలను తీసుకుని వాటిని పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా 52 టెస్ట్ సెంటర్లను ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. ఇక ఆ టెస్ట్ సెంటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* ఏపీలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ, అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
* అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్
* తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వారణాసి బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్ జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ
* అస్సాంలో గౌహతి మెడికల్ కాలేజీ, దిబ్రుగఢ్‌లోని రీజనల్ మెడికల్ రీసెర్చి సెంటర్
* బీహార్‌లో పాట్నా రాజేంద్ర మెమోరియల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
* చండీగఢ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి
* చత్తీస్‌గఢ్‌లో ఎయిమ్స్
* ఢిల్లీలో ఎయిమ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్
* గుజరాత్‌లో అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ, జామ్‌నగర్‌లో ఎంపీ షా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
* రోహ్‌తక్‌లో పండిట్ బీడీ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
* హర్యానాలోని సోనిపట్ బీపీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
* షిమ్లాలో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ
* హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, తండా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
* శ్రీనగర్‌లో షెర్-ఐ-కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జమ్మూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
* జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ ఎంజీఎం మెడికల్ కాలేజ్
* బెంగళూరులోని మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, మైసూర్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, హస్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షిమోగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
* కేరళలోని తిరువనంతపురం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కోజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
* మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్, భోపాల్ ఎయిమ్స్
* మేఘాలయలోని ఎన్ఈఐజీఆర్ఐ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్
* మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్
* మణిపూర్‌లోని జేఎన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
* ఒడిశాలోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్
* పుదుచ్చేరిలోని జవహర్ లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
* పంజాబ్‌లోని పాటాయాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అమృతసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
* రాజస్థాన్‌లోని జైపూర్ సవాయ్ మాన్ సింగ్ మెడికల్ కాలేజీ, జోధ్‌పూర్ డాక్టర్ ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, జలావర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, బికనీర్‌లోని ఎస్‌పీ మెడికల్ కాలేజీ
* తమిళనాడులోని చెన్నై కింగ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, థెని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
* త్రిపురలోని అగర్తల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
* ఉత్తరప్రదేశ్ లోని లక్నో కింగ్స్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్
* ఉత్తరాఖండ్ హల్ద్వానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్, ఐపీజీఎంఈఆర్
* వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్, ఐపీజీఎంఈఆర్