ఇంకా తగ్గని కరోనా కేసులు.. 24 గంటల్లో 560 మరణాలు…!

-

కరోనా మహమ్మారి బాధ నుండి బయటపడాలని అంతా చూస్తున్నా ఇంకా ఈ మహమ్మారి తగ్గడం లేదు. ఇంకా భారతదేశంలో వందల్లో మరణాలు.. వేలల్లో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారి నుండి బయట పడడానికి మార్గం లేదు.

కానీ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో చేతులని శుభ్రంగ కడుక్కోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్తే మాస్క్ ధరించడం వంటి కనీస జాగ్రత్తలని తీసుకుంటే మంచిది.

ఇది ఇలా ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికి 39 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యం కనుక తప్పక వేక్సిన్ వేయించుకోండి. ఇక గత 24 గంటల్లో కరోనా వైరస్ కి సంబంధించి అప్డేట్స్ గురించి చూస్తే..

కరోనా కేసులు దేశంలో ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 38,079 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 560 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 413091 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకూ 39,96,95,879 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది. 42,12,557 మందికి 24 గంటల్లో వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది.

అలానే కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో మరో 43916 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30227792 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు.ఇంకా 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version