కొత్త సంవత్సరం సమయంలో ఝార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే మృతల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగ ఝార్ఖండ్ రాష్ట్రంలోని పాలం జిల్లా హరిహర గంజ్ లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పాలం జిల్లాలోని పంకీ గ్రామానికి చెందిన కూలీలు బిహార్ నుంచి తిరిగి సొంత గ్రామానికి ఒక వ్యాన్ లో వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కూలీలు ప్రయాణిస్తున్న వ్యాన్ ను ఒక ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. అలాగే మరో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మృతి చెందిన వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స తీసుకునే సమయంలో మృతి చెందారు. కాగ మిగితా వారు కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.