భారత రాజ్యాంగానికి నేటితో 70 ఏళ్లు పూర్తికానున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 26 నవంబరు 1949న భారత రాజ్యాంగాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు పార్లమెంటులో వేడుకలు నిర్వహించనున్నారు.
సెంట్రల్‌హాల్‌లో జరిగే ఉభయసభల చారిత్రక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. కాగా, రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏడాదిపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.