దాడి చేసే 72 గంటల ముందే నోటీసులు ఇచ్చా : ఇరాన్

-

సిరియా రాజధానిలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1 ఇజ్రాయెల్ దాడి చేసింది.దీంతో ఇరాన్‌కు చెందిన ఏడుగురు రివల్యూషనరీ గార్డ్‌లు చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడికి దిగింది.ఇరాన్ నిన్న రాత్రి ఇజ్రాయిల్ పై దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లా వైరల్‌గా మారాయి.

తాజాగా  ఈ దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ స్పందించారు.ఇజ్రాయెల్పై దాడి చేసే ముందు తాము హెచ్చరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ తాజాగా అమెరికాకు తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలతో పాటు అమెరికాకు కూడా 72 గంటల ముందే నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా మాత్రమే దాడి ఉంటుందని, ఆ పరిధి దాటమని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ఇరాన్తో టచ్ లోనే ఉన్నప్పటికీ వారు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version