755 పోస్టులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్… 5 రోజుల్లోనే నియామకాలు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర తరమవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత రాకుండా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాలల్లో సరిపడ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు.

ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సులు, 84 మంది లాబ్ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు. దీని ద్వారా రూ. 9.02 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడనుందని ప్రభుత్వ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇంటర్వూలను నిర్వహించి, అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇక తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. మే 1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే అప్పటికి కరోనా పరిస్థితి అదుపులోకి రాకుంటే మారిన్ని రోజులు కర్ఫ్యూ పొడగించే అవకాశం ఉంది. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు సైతం మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఇక మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడిన వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే తెలంగాణలో ఉన్న అందరికీ ఉచిత టీకా ఇవ్వనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో ఉంటున్న వారికి కూడా టీకా ఉచితంగానే ఇస్తామని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version