7th pay commission: ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..జూలైలో మూడు ప్రయోజనాలు..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మూడు గుడ్ న్యూస్ లను వినబోతున్నారు.జూలై నెలలో వీరు మూడు రకాల ప్రయోజనాలు పొందనున్నారు. అందులో ఒకటి డియర్ నెస్ అలవెన్స్ పెంపు, రెండోది గత 18 నెలలకు సంబంధించిన పెండింగ్ డీఏ బకాయిలు పొందడం, చివరగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.

వచ్చే నెల నుంచి ఉద్యోగులు సవరించనున్న డీఏ అందుకుంటారని సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతారని గతంలో భావించారు. అయితే 5 శాతం పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెల ఏఐసీపీ ఇండెక్స్ (ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచిక) ఇందుకు కీలకంగా మారనుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచితే సవరించిన డీఏ 38 శాతానికి చేరుకుంటుంది. ఒకవేళ ఉద్యోగులకు 5 శాతం ఇస్తే మొత్తం డీఏ 39 శాతం పెరగనుంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతున్న డీఏ బకాయిలు 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏలను ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుందని వారు ధీమాగా ఉన్నారు. కాగా, 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు..

ఇకపోతే..డీఏ పెంపు, డీఏ బకాయిలతో పాటు పీఎఫ్ వడ్డీని త్వరలో అందుకోనున్నారు. 2021-22 ఏడాదికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీని ఖాతాల్లో జమ చేసే ఛాన్స్ ఉంది. గతంలో 8.5 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.10 శాతానికి తగ్గించారు. దీంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఇకనుంచి తక్కువశాతం వడ్డీని పొందుతారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.79 శాతానికి పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు తగ్గించడంతో కోట్లాది ఈపీఎఫ్ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారు..వీటితో పాటు మరి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version