విజయ్ బాటలో రజనీకాంత్..ఈ సారి సరికొత్త పాత్రలో సూపర్ స్టార్..!

-

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాలు ఇటీవల కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. గత చిత్రం అన్నాత్తె (తెలుగులో ‘పెద్దన్న’) భారీ అంచనాల నడుమ విడుదలై అంతగా ఆడలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ నెక్స్ట్ ఫిల్మ్ ..‘జైలర్’ డెఫినెట్ గా విజయం సాధిస్తుందని, సాధించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్తున్నారు.

రజనీకి ఇది 169వ సినిమా కాగా, ఇందులో వెరీ డిఫరెంట్ గెటప్స్ లో రజనీకాంత్ కనిపిస్తారని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ స్టైల్ లో నే ఫిల్మ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కూడా అవసరం లేకుండా..స్టోరికి తగ్గట్లు అతి తక్కువ బడ్జెట్ లోనే సినిమా తీయబోతున్నారని సమాచారం.

నెల్సన్ గత చిత్రం ‘బీస్ట్’..తలపతి విజయ్ అభిమానులకు బాగా నచ్చింది. కాగా, ‘జైలర్’ ఫిల్మ్ కూడా ఆ మాదిరిగానే కొంత ఉండబోతున్నదని వినికిడి. ఇటీవల విడుదలైన జైలర్ టైటిల్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్‌కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version