Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!!

-

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలోని సిద్ధార్థ్‌ నగర్ జిల్లాలో జరిగింది. ఈ రోజు ఉదయం.. జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న బొలెరో వాహనం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గోరఖ్‌పూర్ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ ఊరేగింపు కార్యక్రమానికి హాజరై.. తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఆ సమయంలో కారులో 11 మంది ఉన్నారని, వారిలో 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు.

https://twitter.com/ANINewsUP/status/1528216740198461440?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1528216740198461440%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fcrime%2F8-killed-in-road-accident-in-siddharthnagar-up-pm-modi-cm-yogi-expresses-grief-au60-713086.html

Read more RELATED
Recommended to you

Exit mobile version