టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి న్యాయ పోరాటం..

-

టీచర్ పోస్టు కోసం 8 నెలల గర్భవతి న్యాయపోరాటానికి దిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకున్న ఆమె.. తన పోస్ట్‌ను వేరే వారికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో 1:1తో టీచర్ ఉద్యోగానికి ఎంపిక అయ్యింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీని తీసుకున్నది.

అయితే, అన్ని అర్హతలు ఉన్న తనను కాదని, ఆ పోస్ట్‌ను 13వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చారని న్యాయ పోరాటానికి దిగింది. దీనిపై కోర్టులో కేసు వేసిన జ్యోత్స్న.. 8 నెలల గర్భంతో అవస్థలు పడుతూ ప్రజావాణికి వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని ఆ మహిళ అధికారులను వేడుకుంటున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version