ట్యాంక్ బండ్ బోటుప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

-

ట్యాంక్ బండ్ బోటు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని వైద్యులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ఈనెల 26వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజున సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలోని పీపుల్స్ ప్లాజాలో భారతమాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనిలో భాగంగానే రాత్రి సమయంలో బాణాసంచా కాలుస్తుండగా..ట్యాంక్ బండ్‌లో పటాసులతో ఉన్న బోటులో అగ్ని ప్రమాదానికి గురైంది.ఈ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 80 శాతం ఆయనకు కాలిన గాయాలు అయ్యాయి. మరో యువకుడు ఈ ఘటనలో కనిపించకుండా పోయాడు. నేటికి అతని ఆచూకీ దొరకలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version