OSCAR AWARDS 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం

-

95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలంతా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న వేడుకకు తరలి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకల కోసం చాల్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో తెలుగు సినిమా RRR లోని నాటు నాటు పాట ఉండడం.

ఇప్పటికే RRR మూవీ టీమ్ లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరైంది. NTR, రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజమౌళి, గాయకులు కాల భైరవ, రాహూల్ సిప్లిగంజ్ అవార్డుల వేడుక జరుగుతున్న వేదికకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పురస్కారాలు ప్రకటించనున్నారు.

ఈ ఏడాది వేడుకను చాలా ఉత్కంఠ తో చూస్తున్నారు తెలుగు ప్రేక్షుకులు.  నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందని ధీమాగా ఉన్నారు. మరి ఏం జరగనుంది కొన్ని క్షణాల్లో తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version