మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆయన పార్థివదేశాన్ని ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు.ఈ క్రమంలోనే ఆయన మృతదేహానికి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఘన నివాళ్లు అర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారత దేశానికి రెండు సార్లు ప్రధానిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన విశేష కృషి కారణం దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించినదని పలువురు రాజకీయ వేత్తలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కొనియాడుతున్నారు.
👉మన్మోహన్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి
👉కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ప్రధాని pic.twitter.com/YuIYsyRdny— ChotaNews (@ChotaNewsTelugu) December 27, 2024