యుట్యూబ్‌ చూసి బాంబు తయారు చేసిన బాలుడు.. చివరికి

-

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఎన్నో అద్భతాలు సృష్టించవచ్చు. అంతేకాక చెడును సైతం అలవరచుకోవచ్చు. టెక్నాలజీని మంచికి ఉపయోగించవారు కొందరైతే.. చెడుగా వినియోగించి డబ్బులు దండుకోవాలని చూసే వారి మరి కొందరు. అలాంటి వారి కోవలోకి వస్తాడు ఈ బాలుడు. రాత్రికి రాత్రే ధనవంతుడు కావాలనే ఆశతో ముంబైకు చెందిన 17 ఏళ్ల బాలుడు అత్యాశకు పోయి అరెస్ట్ అయ్యాడు. దీంతో యుట్యూబ్ చూసి దీపావళి క్రాకర్స్‌తో బాంబు తయారు చేశాడు. దానిని ఓ పార్సిల్‌కు అమర్చి, బాంబు పేలిన తర్వాత బీమా పొందాలనుకున్నాడు. అయితే బాంబు పేలగానే పోలీసులు అప్రమత్తమై విచారణ ముమ్మరం చేశారు.

ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడైన బాలుడిని గుర్తించి, జువైనల్ హోం‌కు శుక్రవారం పంపించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. పిల్లలకు ఈ కాలంలో టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ.. వారి ఏం చేస్తున్నారన్న విషయంపై ఇంట్లో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. యువత చెడు మార్గాల్లో పయనించకుండే చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన బాలుడిలో విషయలో కూడా ఇదే జరిగిందంటూ పోలీసులు
వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version