ఈమధ్య కాలంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతేకాదు పళ్ళు పసుపు రంగులోకి మారి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు నలుగురులో మాట్లాడడానికి నిస్సంకోచిస్తూ ఉంటారు. ఇక ఈ సమస్య నుంచి బయట పడడానికి తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే మీరు కూడా దంత సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకోసం ఒక అద్భుతమైన చిట్కా తీసుకురావడం జరిగింది.
ప్రతిరోజు 6 లేదా 7 తులసి ఆకులను నములుతూ ఉంటే పళ్ళు తెల్లగా మారడమే కాకుండా బలంగా ఉంటాయి. అలాగే చిగుళ్ల సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక దుర్వాసన నుంచి కూడా దూరం గా ఉండవచ్చు. ఇకపోతే శ్రద్ధ లేకపోతే మాత్రం చిగుళ్ళ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి తులసి ఆకులలో మనకు 71% యూజీనాల్.. 20% మిథైల్ యూజీనాల్ మిగతా 9% ఇతర పోషకాలు లభిస్తాయి. ఇకపోతే తులసి ఆకులలో కార్వాక్రోల్.. టేర్పెన్ వంటి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వల్ల నోటిలో క్రిములపై పోరాటం చేసి నోటి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా నోటిని శుభ్రంగా ఉంచుతాయి.
తులసి ఆకులను నమలడం ఇష్టం లేని వాళ్ళు ప్రతిరోజు తులసి ఆకుల పొడిలో ఆవనూనె కలిపి టూత్ పేస్ట్ గా కూడా వాడుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును తగ్గించి దంతాలను శుభ్రం చేస్తాయి. ఇక అంతే కాదు మీ పళ్ళు తెల్లగా మెరవాలి అంటే తులసి ఆకులను నమలడం చాలా మంచిది. ఇందులో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఏడూ రోజుల్లోనే దంతాలను తెల్లగా మారుస్తాయి. అలాగే ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ప్రతి ఒక్కరి పెరట్లో తులసి చెట్టు ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ఇలా వీటిని నములుతూ ఉంటే దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు.